టీడీపీ మహానాడులో మినీ మేనిఫెస్టో ప్రకటించింది. దానికి సూపర్ సిక్స్ అని పేరు పెట్టింది. ఈ సూపర్ సిక్స్ ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీనికి వైసీపీ కూడా ప్రచారం చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి బహిరంగసభా వేదికలపై ఈ పథకాల గురించి చెప్పి చాలా నిధులు అవసరం అవుతాయమని మన రాష్ట్రం దగ్గర అన్ని డబ్బులు లేవని చెబుతూ వస్తున్నారు.
వర్క్ ఫ్రం ప్యాలెస్ చేసి.. ఒక్క పెట్టుబడి.. ఒక్క వ్యాపారం అభివృద్ధి చేయని జగన్ రెడ్డి.. పథకాలు ఇస్తే… ప్రపంచం అంతా తిరిగి పెట్టుబడులు… అభివృద్ధి పనులు చేయించే చంద్రబాబు ఎందుకు ఇవ్వలేరన్న ప్రశ్న ప్రతి ఒక్కరికీ వస్తుంది. దానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వైసీపీది. సంపద సృష్టి అనేది చంద్రబాబు బ్రాండ్. జగన్ రెడ్డి మరోసారి గెలిస్తే మా ఆస్తుల విలువ 90 శాతం పడిపోతుందేమోనని ఆందోళన చెందుతున్న వారు ఎక్కువగా ఉన్నారు. చంద్రబాబు వస్తే… ఆస్తుల విలువ పెరుగుతుదని చూసే వారు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు.
సూపర్ సిక్స్ పథకాలకు బడ్జెట్ ఎంత అవుతుందో కొంతమంది వైసీపీ మేధావులు విశ్లేషిస్తున్నారు. మరికొంత మంది చేతులు ఎత్తేశారని ఫేక్ ప్రచారాలు కూడా చేస్తున్నారు. ఇవన్నీ టీడీపీ మినీ మేనిఫెస్టోకు ఉచిత ప్రచారం తెచ్చి పెట్టేవే. ఎంత గా చర్చ జరిగితే … టీడీపీ మినీ మేనిఫెస్టోకు అంత లాభం. ఈ విషయంలో టీడీపీ కూడా వైసీపీ మీడియా, సోషల్ మీడియాను ట్రాప్ లో పడేసేందుకు ప్రయత్నిస్తోంది.