హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి చిత్తూరు జిల్లా ఏర్పేడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గతనెల 26వ తేదీన రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఎయిర్ పోర్ట్ మేనేజర్‌పై దాడిచేసిన కేసులో ఈ అరెస్ట్ జరిగింది. ఈ కేసులో మిథున్ రెడ్డి సహా 16మందిపై ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ రాకపోవటంతో చెవిరెడ్డి ఇవాళ స్వయంగా ఏర్పేడు పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయారు. ప్రొటోకాల్ విషయమై మిథున్ రెడ్డికి, సిబ్బందికి గొడవ ఏర్పడినప్పుడు చెవిరెడ్డి, ఆయన అనుచరులు పెద్దసంఖ్యలో విమానాశ్రయానికి వచ్చి ఎయిర్‌పోర్ట్‌లో గొడవచేశారని ఆరోపణ.