సోదరుడు జగన్ ఆస్తులివ్వడం లేదని షర్మిలకు కోపంగా ఉన్న ప్రచారం రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ప్రత్యేక రాజకీయ పార్టీ పెట్టి ఎలాగైనా తన ప్రభావం చూపించాలని కష్టపడుతున్న షర్మిలకు ప్రస్తుతం ఆర్థిక సమస్యలు వెంటపడుతున్నాయి. ఆమెకు ఆర్థిక సాయం చేయడానికి వచ్చే వారిని జగన్ ఆపేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో షర్మిల .. కర్ణాటకలో ఉన్న ఉమ్మడి ఆస్తుల్లో వాటా దక్కించుకోవడానికి అక్కడ డిప్యూటీ సీఎం శివకుమార్ మద్దతు కోరుతున్నట్లుగా తెలుస్తోంది.
నెల రోజుల వ్యవధిలో రెండో సారి షర్మిల బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్ తో సమావేశం అయ్యారు. భేటీ ఎందుకో చెప్పలేదు కానీ.. మర్యాదపూర్వకమేనని మీడియాకు సమాచారం ఇచ్చారు. మరీ ఇన్ని సార్లు మర్యాద కోసం ఎందుకు కలుస్తారని ఏదో ఉందన్న చర్చలు జరుగుతున్నాయ. పొత్తులు, విలీనాలు అని బయట చెప్పుకుంటున్నా.. తెలంగాణ కాంగ్రెస్ మాత్రం అసలు షర్మిల ఉనికిని గుర్తించడానికి ఆసక్తి చూపించడం లేదు. రేవంత్ అసలు ఆమెకు ఇక్కడేం పని అని ప్రశ్నిస్తున్నారు.
షర్మిల కూడా పొత్తులు, విలీనాలు లేవని చెబుతున్నారు. మరి ఎందుకు ఇన్ని సార్లు కలుస్తున్నారంటే.. ఆస్తుల పంచాయతీ కోసమేనని అంటున్నారు. బీజేపీ పెద్దలు షర్మిలకు సహకరించలేదు. దీంతో ఆమె శివకుమార్ ను సంప్రదించారని అంటున్నారు. షర్మిలకు డీకే కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే ఉమ్మడి ఆస్తుల చిట్టాను.. రెడీ చేసుకుని అందులో తన వాటా ఇప్పించాలని.. లేకపోతే.. ఏం జరుగుతుందో జగన్ కు చూపించాలని ఆమె కోరుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
నిజానికి ఉమ్మడి ఆస్తులన్నీ బినామీ పేర్ల మీద..సూట్ కేసు కంపెనీల పేర్ల మీదనే ఉన్నాయి. ఆసలు ఉమ్మడి ఆస్తి చాలా తక్కువగా ఉంటుంది.ఈ సూట్ కేసు కంపెనీల ఆస్తులు పంచకోవడానికే అసలు పంచాయతీ జరుగుతోందని అంటున్నారు.