అక్కినేని హీరోలకు రొమాంటిక్ హీరో అనే ఇమేజ్ ఉంది. దాన్ని దాటుకొని రావడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు నాగచైతన్య. తన కొత్త చిత్రం ‘యుద్దం శరణం’ ఓ యాక్షన్ థ్రిల్లర్. కృష్ణ ముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం సంస్థ నిర్మించింది. పాటలు, ట్రైలర్ ఈరోజు విడుదలయ్యాయి. టీజర్‌తో ఆల్రెడీ ఆకట్టుకొన్న ‘యుద్దం శరణం’… ట్రైలర్లోనూ అదే జోష్.. అదే స్పీడ్ చూపించింది. `”మన జీవితాలు ఆనందంగా ఉన్నప్పుడు ప్రపంచం అంతా అద్భుతంగా ఉన్నట్టే అనిపిస్తుంది” అనే నాగచైతన్య డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది.
ట్రైలర్ చూస్తుంటే.. ఫాస్ట్ బేస్డ్ స్క్రీన్ ప్లేతో సాగే సినిమా అనే విషయం అర్థమవుతుంది. ప్రశాతంగా జీవితం సాగిపోతున్న ఓ కుటుంబంలోకి ఓ క్రిమినల్ అడుగుపెడితే.. వాళ్ల జీవితాలు ఎలా మారిపోయాయో.. ఈ సినిమాలో చూపిస్తున్నారు.
”తప్పించుకొనేవాడికెప్పుడూ రెండు ఆప్షన్లుంటాయి. అయితే దాక్కోవడం, లేదంటే పారిపోవడం” అంటూ శ్రీకాంత్ డైలాగ్‌కి ”పరిగెత్తే ప్రతివాడూ.. పారిపోతున్నట్టు కాదు” అనే కౌంటర్ ఆకట్టుకొంది. ఈ సినిమా థీమ్ ఏంటన్నది ఈ డైలాగ్‌లోనే అర్థమైపోతోంది. వివేక్ సాగర్ ఇచ్చిన ఆర్.ఆర్, బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తున్న ‘యుద్దం శరణం’ థీమ్ మ్యూజిక్ ఈ ట్రైలర్‌ని మరింతగా ఎలివేట్ చేశాయి. సెప్టెంబరు 8న ఈచిత్రం విడుదల కాబోతోంది.
https://www.youtube.com/watch?v=7m1-hz4jHpA