బంగ్లాదేశ్ ను అధికారం లేని పాలకుడు మహమ్మద్ యూనస్ నిండా ముంచేస్తున్నారు. ప్రజలు ఎన్నుకోని ఆయన.. దేశ పాలసీలను మొత్తం మార్చేస్తున్నారు. చైనాకు పాకిస్తాన్ కు దగ్గరగా మార్చేసి ఉగ్రవాద శిబిరాలకు కేంద్రంగా మార్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన తీరు చూసి పాపం బంగ్లాదేశ్ అనుకుంటున్నాయి ఇతర దేశాలు. ఆర్థిక వృద్ధిలో దూసుకుపోతున్న ఆ దేశం ఇప్పుడు పాకిస్తాన్ లా మారిపోయే అవకాశం కనిపిస్తోంది.
బంగ్లా ప్రజలకు, యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించేప్రాజెక్టుల్ని ఆయన క్యాన్సిల్ చేస్తున్నారు. తమ దేశాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వేదికగా వాడుకునేందుకు పాకిస్తాన్ కు అవకాశం కల్పిస్తున్నారు. డబ్బుల్లేకపోయినా చైనా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కొంటున్నారు. పాకిస్తాన్ నుంచి అణు బాంబులు కూడా సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. నోబెల్ శాంతి బహుమతి పొందిన ఆయన ఇలాంటి పనులు చేస్తూండటం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
షేక్ హసీనా మళ్లీ బలపడితే తమను వెళ్లగొట్టేస్తారని వారికి బాగాతెలుసు. అందుకే షేక్ హసీనాను అప్పగించాలని ఇండియాపై ఒత్తిడి చేస్తున్నారు. ఆమెను బంగ్లాదేశ్ పిలిపించి ఉరి తీయాలన్నా ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. కోర్టులను అడ్డం పెట్టుకుని యూనస్ ఘోరమైన రాజకీయాలు చేస్తున్నారని హసీనా కుమారుడు అంటున్నారు. మొత్తంగా అభివృద్ధిలో పరుగులు పెడుతున్న దశలో బంగ్లాదేశ్ ను .. మరో పాకిస్తాన్ చేస్తున్నారు యూనస్.