వంద మంది ఇంటలిజెన్స్ పోలీసుల నిరంతర నిఘా, పదిహేను వందల మందితో సోషల్ మీడియా సైన్యం, ఓ పదం అటూ ఇటూ అయితే ట్రోల్ చేయడానికి రూ.కోట్లు పెట్టి రెడీ చేసుకున్న బాట్స్, ఓ నాయకుడ్ని కించ పర్చడానికి.. అతని ఇమేజ్ ను దిగజార్చడానికి ప్రత్యర్థులు చేసుకున్న ఏర్పాట్లు ఇవి. ఈ ఏర్పాట్లు చూస్తేనే ఆ నాయకుడు ఎంత గా వారిని భయపెడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏర్పాట్లు చేసింది వైసీపీ.. ఆ నాయకుడు లోకేష్. యువగళం పాదయాత్రకు టీడీపీ ఎంత ఖర్చు పెట్టిందో.. వైసీపీ కూడా విఫలం అయిందని ప్రచారం చేయడానికి అంతే ఖర్చు పెట్టింది. కానీ యువగళం..నిప్పు రవ్వలా ప్రారంభమై.. యువతలో ప్రభుత్వ వ్యతిరేకతను అగ్నిగోళంలా మండిస్తోంది. ఇవాళ మూడు వేల కిలోమీటర్లకు చేరుకుంటోంది.
రాక్షసత్వం అడ్డుపడినా వెనక్కి పడని యువగళం అడుగు
కుప్పంలో లోకేష్ పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఆయన పాదయాత్రలో జనాల్లేరంటూ… నీలి..కూలి మీడియాతో చేసే ప్రచారాలు ఓ వైపు.. లోకేష ప్రసంగాల్లో మాట దొర్లితే ట్రోల్ చేసేందుకు సైన్యం ఓ వైపు హడావుడి చేస్తూనే ఉన్నాయి. మధ్యలో పోలీసులు యువగళాన్ని నొక్కడానికి చేయని కుట్రల్లేవు. చెల్లని జీవో 1 పేరుతో మైక్ కూడా లాక్కున్నారు. నిలబడి మాట్లాడితే స్టూల్ లాక్కున్నారు. దాడులకు ప్రయత్నించారు. దాడులు చేశారు. గోదావరిజిల్లాలకు వచ్చే సరికి యువగళం వాలంటీర్లపై దాడులు చేసివారినే అరెస్టు చేశారు. అయినా యువగళం యాత్ర ఒక్క అడుగు వెనక్కి పడలేదు. ముందుగా సాగుతూనే ఉంది. చంద్రబాబును అరెస్టు చేసి… యవగళాన్ని నొక్కేశామనుకున్నారు కానీ.. అన్ని సమస్యలను అధిగమించి మళ్లీ ప్రాంభించారు. పాలకులు ఓడిపోయారని తేల్చారు. నేను మూడు వేల కిలోమీటర్ మైలు రాయిని అందుకుంటోంది.
చరిత్రలో నిలిచిపోయే పాదయాత్ర
గతంలో పాదయాత్రలు చాలా మంది చేశారు.కానీ లోకేష్ పాదయాత్ర ప్రత్యేకం. ల ఎందుకంటే.. లోకేష్ ఓ సామాన్య నాయకుడిగానే పాదయాత్ర చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు. పార్టీ అధ్యక్షుడు కాదు. అయినా ఆయనకు లభించిన స్పందన మాత్రం అంతకు మించి అన్నట్లుగా ఉంది. జగన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు… చాలా చోట్ల పట్టుమని రెండు వందల మంది కూడా ఉండేవారు కాదు.. అలాంటి యాత్రను… వీకెండ్ లో కోర్టుకు హాజరవుతూ కొనసాగించారు. అాలాంటి పాదయాత్రల కన్నా యువగళం వెయ్యిరెట్లు మేలు. ప్రతి వంద కిలోమీటర్లకు తానిచ్చిన హామీలతో మైలురాళ్లు వేయించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక చేయకపోతే నిలదీయవచ్చన్న ధైర్యం ప్రజలకు కల్పించారు.
సంపూర్ణ లీడర్ గా లోకేష్ ను ప్రజల ముుందు ఆవిష్కరించిన యువగళం
మూడు వేల కిలోమీటర్లు సాదాసీదాగా సాగిపోలేదు. యువగళాన్ని ఆపేయడానికి చేసిన ఎన్నో ప్రయత్నాలను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు వచ్చారు. ఆ ప్రయత్నాలను లోకేష్ ఎదుర్కొన్న తీరు .. క్యాడర్ కు భరోసా ఇచ్చింది. ఆయన నాయకత్వ సామర్థ్యంపై మరింత నమ్మకాన్ని పెంచింది. పార్టీ వ్యవహారాలను ఒంటి చేతుల్తో చక్క బెట్టడమే కాదు.. పొత్తు వ్యవహారాలను సమన్వయం చేయడం.. అభ్యర్థుల ఎంపిక విషయంలో తెర వెనుక సన్నాహాలు అన్నీ లోకేష్ చేస్తూ.. మల్టీ టాస్కింగ్ చేయగల నేతగా నిలబడ్డారు.
యువగళం టీడీపీలో జోష్ మాత్రమే కాదు.. రాష్ట్ర ప్రజల ముందు ఓ సమర్థవంతమైన నాయకుడ్ని ఉంచిందని అనుకోవచ్చు.