ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి మరోసారి టీటీడీ చైర్మన్ పీఠం లభించింది. మొన్నటి వరకూ టీటీడీ చైర్మన్‌గా ఉన్న సుబ్బారెడ్డికి వెంటనే పదవిని రెన్యూవల్ చేయలేదు. పాలక మండలిని కూడా నియమించలేదు. టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డే కొనసాగుతారంటూ మీడియాకు లీకులిచ్చినా అధికారిక ఉత్తర్వులు విడుదల చేయడానికి మాత్రం సమయం తీసుకున్నారు. టీటీడీ పదవీ కాలం ముగిశాఖ స్పెసిఫైడ్ అధారిటీని ఏర్పాటు చేసింది. రెండు రోజుల కింట ఆ స్పెసిఫైడ్ అధారిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు… టీటీడీ చైర్మన్‌గా సుబ్బారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సుబ్బారెడ్డి గతంలో ఎంపీగా ఉండేవారు. మాగుంటను చేర్చుకుని ఆయనకు టిక్కెట్ నిరాకరించడంతో … న్యాయం చేయడానికని టీటీడీ బోర్డు పదవి ఇచ్చారు. ఇటీవల ఆయన తనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలన్న డిమాండ్‌ను జగన్ ముందు ఉంచినట్లుగా చెబుతున్నారు. అయితే మరో రెండేళ్ల పాటు టీటీడీ చైర్మన్‌గా ఉండాలని జగన్ సూచించడంతో సుబ్బారెడ్డి అసంతృప్తికి గురవుతున్నారని అంటున్నారు. ఆయనకు సర్ది చెప్పి ఒప్పించడానికే ఆలస్యం అవుతోందని వైసీపీ వర్గాలు చెప్పుకున్నాయి. రాష్ట్రంలో ఉన్న రాజకీయ సమీకరణాలు.. కుల రాజకీయాల కారణంగా.. ఈ సారి క్షత్రియులకు టీటీడీ బోర్డు పదవిని ఇస్తారని అనుకున్నప్పటికీ మళ్లీ వైవీ సుబ్బారెడ్డికే చాన్సిచ్చారు.
పాలక మండలి సభ్యులను ఇంకా నియమించలేదు. వారిని కూడా త్వరలో నియమించనున్నారు. పదవుల కోసం పెద్ద ఎత్తున ఒత్తిడి ఉండటం.. ఇతర రాష్ట్రాల వారిని కూడా నియమించాల్సి వస్తూండటంతో ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. గతంలో శేఖర్ రెడ్డికి సభ్యునిహోదా కల్పించి ప్రభుత్వం విమర్శల పాలయింది. టీడీపీ హయాంలో సభ్యుడిగా ఉన్న అతను సీబీఐ కేసుల్లో ఇరుక్కోవడంతో తొలగించారు. అప్పట్లో లోకేష్ బినామీ అని ఆరోపణలు చేసిన జగనే..స్వయంగా ఆయనకు టీటీడీ బోర్డులో మళ్లీ పదవి ఇచ్చారు. ఈసారి కూడా ఆయనకు చోటు కల్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది.