విశాఖలో భూముల దందా విషయంలో వైసీపీలో ఇద్దరు పెద్ద రెడ్ల మధ్యచాలా పెద్ద రచ్చ జరుగుతోంది. తాడేపల్లి ప్యాలెస్ లోనే పంచాయతీ జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వానికి చెందిన భూమిని తరాల కిందట రాణీ వారి వారసులదని నమ్మించే దసపల్లా భూములను కొట్టేశారు. అయితే ఆ భూముల చట్టు ఇప్పుడు వాటాల పంపకాల్లో తేడా లు వస్తున్నాయి. విజయసాయిరెడ్డి ఇంచార్జ్ గా ఉన్నప్పుడు ఆయన చెప్పిన వారికి వాటాలు దక్కాయి. ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి ఇంచార్జ్ గా ఉన్నారు. ఆయన కూడా రంగంలోకి దిగారు.
విజయసాయిరెడ్డి మనుషులు సంతకాలు ఫోర్జరీ చేశారని.. అరెస్టులకు ఆదేశించారు. వాళ్లు చెప్పిన వాళ్లను అరెస్టు చేయకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో పోలీసులకు తెలుసు. కానీ ఇక్కడ అరెస్టు చేయమన్నది టీడీపీ వాళ్లను కాదు కాబట్టి పోలీసులు ఆలోచించారు. ముందు మీలో మీరు తేల్చుకోవాలన్నట్లుగా చూశారు. కానీ అలా చూసినందుకు సీపీకి ట్రాన్స్ ఫర్ అయింది. పంచాయతీ తాడేపల్లి ప్యాలెస్ కు చేరింది. అయితే అక్కడా ఏమీ తేల్చలేదని.. కోల్డ్ వార్ అలా సాగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
విశాఖలో భూ దందాలపై ప్రజల్లో ఇప్పటికే అనే ఆందోళనలు ఉన్నాయి. సాక్షాత్తూ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన కథలో ట్విస్టులు బయటకు రావడం లేదు. ఏం జరిగిందో పోలీసులు చెప్పడం లేదు. ఆ నేరాన్ని అలా మరుగునపడేలా చేశారు. ఇప్పుడు ఇద్దరు అగ్ర నేతలు విశాఖలో దసపల్లా భూములపై చేస్తున్న ఆధిపత్య పోరాటంతో ప్రజల్లో మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. వైసీపీలోనూ ఇదే చర్చ జరుగుతోంది.