మోహన్ బాబు – వైవీఎస్ చౌదరిల మధ్య ఏర్పడిన ఆర్థిక లావాదేవీల వివాదం.. మరింత ముదురుతోంది. కొత్తగా.. శంషాబాద్ దగ్గర జల్ పల్లి అనే గ్రామంలో.. తనకు సంబంధించిన అర ఎకరం స్థలంలోకి.. మోహన్ బాబు.. తనను అడుగు పెట్టనీయడం లేదని… వైవీఎస్ చౌదరి కొత్తగా లీగల్ నోటీసు పంపించారు. జల్ పల్ల్లిలోని అర ఎకరం స్థలం తన స్వార్జితంతో కొనుక్కున్నదని.. వైవీఎస్ చౌదరి లీగల్ నోటీసులో పేర్కొన్నారు. మోహన్ బాబుకు జల్ పల్లిలో సొంత నివాసం ఉంది. మోహన్ బాబు నివాసానికి ఆనుకునే… వైవీఎస్ చౌదరి స్థలం ఉంది. ఈ స్థలంలోనే.. వెళ్లనీయడం లేదని..వైవీఎస్ చౌదరి అంటున్నారు. ముఖ్యంగా… చెక్ బౌన్స్ కేసులో… ఎర్రమంజిల్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించిన తర్వాత ఈ వేధింపులు పెరిగాయని… వైవీఎస్ చౌదరి ఆరోపిస్తున్నారు.
సలీమ్ సినిమాకు సంబంధించిన రెమ్యూనరేషన్ మోహన్ బాబు ఎగ్గొట్టారని.. ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందంటూ.. తొమ్మిదేళ్ల కిందట.. వైవీఎస్ చౌదరి.. కోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరిపిన ఎర్రమంజిల్ కోర్టు.. ఉద్దేశపూర్వకంగానే..మోహన్ బాబు డబ్బులు ఎగ్గొట్టారని నిర్ధారించి ఏడాది జైలు శిక్ష విధించింది. అయితే నెల రోజుల్లోపు డబ్బులు చెల్లించేందుకు అవకాశం ఇస్తూ బెయిల్ మంజూరు చేసింది. కానీ దీనిపై మోహన్ బాబు మరో విధంగా స్పందించారు. కోర్టును తప్పుదోవ పట్టించారని.. ఎగువ కోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పారు. అయితే.. ఇప్పటి వరకూ.. ఈ తీర్పు విషయంపై.. వైవీఎస్ చౌదరి.. బహిరంగంగా ఎవరితోనూ మాట్లాడలేదు.
కానీ.. ఈ తీర్పు తర్వాత మోహన్ బాబు.. తన స్థలంలోకి తనను వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని తీవ్రమైన ఆరోపణలుచేస్తూ.. లీగల్ నోటీసుపంపారు. మీడియాకు కూడా.. లీగల్ నోటీసుతో పాటు.. ఆరోపణల సారాంశాన్ని పంపారు. మొత్తానికి… మోహన్ బాబు.. చెక్ బౌన్స్ కేసు వ్యవహారం.. రకరాకల మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఓ రాజకీయ పార్టీలో చేరి .. ప్రచారం కూడా చేసిన మోహన్ బాబు.. ఇప్పుడీ వివాదాన్ని ఎలా పరిష్కరించుకుంటారో చూడాలి..!