అదిరింది అనే కామెడీషోలో జగన్మోహన్ రెడ్డిపై ఓ కమెడియన్‌తో స్కిట్ వేయించడంతో వైసీపీ హరాస్మెంట్కు గురైంది జీ యాజమాన్యం. వారు చెప్పినట్లుగా ఆ కామెడి క్లిప్ ఎక్కడా కనిపించుకండా చేసే ప్రయత్నం చేసింది. ఆర్టిస్టులతో క్షమాపణలు చెప్పించింది. వైసీపీ నేతల బెదిరింపులపై మొదట అదిరింది షోకు అంతా తానై వ్యవహరిస్తున్న నాగబాబు… రెబల్ రియాక్షన్స్ ఇచ్చినప్పటికీ.. తర్వాత సైలెంటయిపోయారు. ఇప్పుడు జీ యాజమాన్యం ఏపీ ప్రభుత్వం మరింత ఆగ్రహానికి గురి కాకుండా..ప్రసన్నం చేసుకునేందుకు … పది అంబులెన్స్‌లను ప్రభుత్వానికి బహుకరించింది.
విజయవాడలో ఏపీఐఐసీ చైర్మన్, సినీ నటి రోజా చేతులమీదుగా వీటిని ప్రభుత్వానికి జీ యాజమాన్యం అందచేసింది. రోజా వాటిని నడిపి .. ఓపెనింగ్ చేశారు. గతంలో ఎప్పుడు జీ టీవీ యాజమాన్యం ఇలా ప్రభుత్వాలకు విరాళాలు ఇచ్చిన దాఖలాలు లేవు. కేవలం ఆ కామెడి స్కిట్ … వైసీపీ మనోభావాలు దెబ్బతీయడం వల్ల … ఆ ఆగ్రహం తమ చానల్‌పై పడకుండా..ఉండేలా.. జీ తెలుగు ఇలా పది అంబులెన్స్‌లను విరాళంగా ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. అదిరింది షోలో జగన్‌ను ఇమిటేట్ చేసిన షో…అభ్యంతరకంగా ఏమీ లేదు.
కానీ వైసీపీ నేతలు..కార్యకర్తలు.. చాలా వైల్డ్ గా రియాక్టయ్యారు. తమదైన బ్రాండ్‌లో బూతులు.. బెదిరింపుల బాట ఎంచుకున్నారు. దాంతో కామెడీ చేసి పొట్టపోసుకునే ఆర్టిస్టులు తమ భవిష్యత్ పై ఎక్కడ దెబ్బ పడుతుందోనని ఆందోళన చెందారు. చివరికి సారీ చెప్పి.. బయటపడ్డారు. జీ చానల్ ..పది అంబులెన్స్‌లతో లెక్క సరి చేసింది.