టీ20 వరల్డ్ కప్ లో సంచలనం నమోదైయింది. పాకిస్తాన్ జట్టుని పసికూన జింబాబ్వే మట్టికరిపించింది. కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి ఒక్క పరుగుతో చిత్తు చేసింది. చివరి వరకూ ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ లో పై చేయి సాధించి జింబాబ్వే జట్టు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు నిర్ణీత ఓవర్లలో 130పరుగులు చేసింది.
131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ని నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 129 పరుగల వద్దే నిలువరించింది జింబాబ్వే. చివరి బంతికి మూడు పరుగులు కావాల్సివుండగా కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి.. ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం సాధించింది జింబాబ్వే. జింబాబ్వే బౌలింగ్లో సికందర్ రజా 3, బ్రాడ్ ఎవన్స్ 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఓటమితో పాక్ జట్టుకుకు సెమిస్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి.