ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం … ఆంధ్రప్రదేశ్‌లోని మరో పరిశ్రమపై వేధింపులకు పాల్పడుతోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కడపలోని ఎర్రగంట్ల సమీపంలో ఉన్న జువారి సిమెంట్ పరిశ్రమను ఉన్న పళంగా మూసేయాలని ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సంస్థకు తక్షణం కరెంట్ సరఫరా నిలిపివేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు విద్యుత్ శాఖ అధికారులకు కూడా నోటీసులు జారీ చేశారు. దీనికి కారణం.. జువారి సిమెంట్ కాలుష్య పరంగా తీసుకోవాల్సి నజాగ్రత్తలు తీసుకోవడం లేదని ఎపీపీసీబీ తేల్చడమే. అయితే జువారి సిమెంట్ కంపెనీ వాదన విన్నారో లేదో కానీ.. క్లోజర్ ఆర్డర్స్ జారీ చేయడంలో సిమెంట్ పరిశ్రమ రంగంలో కలకలం రేపుతోంది.
అదే సమయంలో జువారి సిమెంట్స్ పరిశ్రమ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే తమ వెబ్సైట్లో మాత్రం.. ఓ లేఖను ఉంచింది. ఎర్రగంట్ల ప్లాంట్కుసంబంధించి అన్ని పొల్యూషనల్ క్లియరెన్స్‌లు ఉన్నాయని లేఖ సారాంశం. దానికి సంబంధించిన పత్రాలను కూడా.. లేఖలో పెట్టింది. ఈ లేఖను కేంద్ర ప్రభుత్వానికి చెందిన పర్యావరణ మంత్రిత్వ శాఖకు పంపింది. అలాగే.. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీకి పంపింది. ఈ లేఖపై ఆదివారం తేదీనే ఉంది. అంటే.. ఏపీ ప్రభుత్వం మూసివేత ఉత్తర్వులు ఇచ్చిందని తెలుసుకుని జువారి సిమెంట్ యాజమాన్యం హుటాహుటిన కేంద్రానికి ఈ లేఖ రాసింది. తమకు పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి.. ఎన్ని నిబంధనలు ఉన్నాయో.. అన్నీ ఆమలు చేశామని ఆ లేఖలో పేర్కొంది. జువారి సిమెంట్ లేఖ లింక్ ఇక్కడ చూడొచ్చు.
Click here for : జువారి సిమెంట్ లేఖ
కడప జిల్లాలోనే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన భారతి సిమెంట్ ప్లాంట్ ఉంది. ఆ సిమెంట్ ప్లాంట్ పొల్యూషన్‌పై తీవ్రమైన ఆరోపణలు వస్తూ ఉంటాయి. సమీప గ్రామాల ప్రజలు ఆందోళనలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పొల్యూషన్‌కు సంబంధించి ఏమైనా ఉంటే… వాటిని సరి చేయాలని చెబుతారు కనీ.. ఏకంగా మూసివేత ఉత్తర్వులు ఇవ్వడం … ఏదో జరుగుతోందన్న ఆరోపణలు రావడానికి కారణం అవుతోంది. జువారీ సిమెంట్ కూడా.. కేంద్రానికి ఫిర్యాదు తరహాలో లేఖపంపింది. ఆదివారం కాబట్టి.. ఆ సంస్థ ప్రతినిధులెవరూ స్పందించలేదు. సోమవారం ఆ సంస్థ అధికారికంగా స్పందించే అవకాశం ఉంది. ఎలాంటి ప్రకటన వస్తుందనేది వేచి చూడాల్సి ఉంది.