కేంద్రమంత్రి, సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈసీకి ఫిర్యాదు అందింది. ఓటు వేసిన అనంతరం ఎన్నికల ప్రవర్తన నియామళికి విరుద్దంగా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.
ఓటు హక్కును వినియోగించుకున్న కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… పోలింగ్ అంటే హాలీడే కాదని.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఇదంతా బాగానే ఉన్నా..ఆయన ప్రధాని మోడీ పేరు ప్రస్తావించడం వివాదాస్పదం అవుతోంది. పోలింగ్ రోజున పార్టీ పేర్లు, వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం ఎన్నికల నిబంధనలకు విరుద్దం. కానీ, ఓటేసిన అనంతరం కిషన్ రెడ్డి మోడీ పేరును ప్రస్తావించడంతో కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
ఎన్నికల నిబంధనలను ఉల్లఘించడమేనని, కిషన్ రెడ్డిపై కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేయలని కాంగ్రెస్ పార్టీ నేతలు సీఈవోను కోరారు.