రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎన్నికల కమీషన్, దానికి ఒక కమీషనర్ అవసరమవడంతో రాష్ట్ర ప్రభుత్వం అందుకోసం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన ఎన్నికల కమీషన్ కి ప్రస్తుతం గవర్నర్ నరసింహన్ కి ముఖ్య కార్యదర్శిగా చేస్తున్న ఎన్. రమేష్ కుమార్ ని కమీషనర్ గా నియమించించింది. ఆయన ఈ పదవిలో ఐదేళ్ళ పాటు పనిచేస్తారు. ఇక నుండి రాష్ట్రంలో జరుగబోయే ఎన్నికలను కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఆయనే నిర్వహిస్తారు.