హైదరాబాద్: ఐటీకంపెనీల ఉద్యోగుల లైఫ్ స్టైల్ ఎక్కువగా ఒత్తిడితోకూడి ఉంటుందనే విషయం తెలిసిందే. తమ ఉద్యోగులను ఈ ఒత్తిడి సమస్యనుంచి తప్పించటానికి ‘అన్ లిమిటెడ్ హైదరాబాద్’ అనే ఓ ఐటీ స్టార్టప్ కంపెనీ ఒక వినూత్న ప్రయోగం చేసింది. చూడగానే ముద్దులొలుకుతూ ఉండే ఒక చిన్న కుక్కపిల్లను తీసుకొచ్చి తమ ఆఫీసులో పెట్టింది. ఒత్తిడిలో ఉన్న ఉద్యోగులు ఆ కుక్కపిల్లను దగ్గరకు వెళ్ళి ఆడుకుని ఒత్తిడినుంచి బయటపడతారని ఆ కంపెనీ యజమానుల ఆలోచన. మొత్తానికి ఈ ఐడియా మంచి ఫలితాన్నే ఇస్తోందట. ఒత్తిడిలోఉన్న ఉద్యోగులు రుస్తుమ్ అనే ఆ కుక్కపిల్లదగ్గరకు వెళ్ళి ఆడుకుని రీఛార్జ్ అవుతున్నారట. ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పదవులలాగా ఆ కంపెనీ అధినేతలు రుస్తుమ్కు ఛీఫ్ క్యూట్‌నెస్ ఆఫీసర్(CCO) అనే హోదాను కల్పించారట.