‘బొమ్మరిల్లు’ సినిమా దర్శకుడు భాస్కర్ జాతకాన్ని మార్చేసింది. ఆ సినిమానే ఆయన ఇంటిపేరు అయింది. రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోలతో సినిమా చేసే ఛాన్స్ త్వరగానే వచ్చేసింది. అయితే బొమ్మరిల్లు సినిమానే భాస్కర్ కి ఒక శాపంగా కూడా మారింది. భాస్కర్ ఎలాంటి సినిమా తీసిన ‘బొమ్మరిల్లు’ అంత గొప్పగా లేదనే విమర్శని ఎదురుకోవాల్సి వచ్చింది. అయితే చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’తో ఓకే అనిపించారు భాస్కర్. అటు అఖిల్ కి కూడా ఈ సినిమాతో కొంత ఉపసమనం లభించింది. వసూళ్ళు కూడా బావున్నాయి.
హిట్ మీద నడిచే ఇండస్ట్రీ ఇది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ కి ఆ టాక్ రావడంతో భాస్కర్ మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ గీతాఆర్ట్స్ బ్యానర్లోనే మరో చిత్రం చేసేందుకు ఒప్పందం కుదిరిందని తెలిసింది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ ని చాలా లిమిటేషన్స్ లో తెరకెక్కించారు భాస్కర్. మేకింగ్ లోనే కాదు.. రేమ్యునిరేషన్ విషయంలో కూడా బాగా తగ్గారు. నెల జీతానికి పని చేశారని ఇన్ సైడ్ టాక్ వినిపించింది. అయితే చేయబోయే కొత్త సినిమా విషయంలో మాత్రం తనకు పూర్తి స్వేఛ్చ కావాలని భాస్కర్ కోరడం, దానికి నిర్మాత అంగీకరించడం జరిగిందట. మొత్తానికి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ భాస్కర్ కి కొత్త జోష్ ఇచ్చింది.