ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లపై ఆయన భార్య సంతోషి రూప మూడు వారాల క్రితం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసిన విషయం చాల ఆలశ్యంగా బయటపడింది. అప్పుడే పోలీసులు సెక్షన్ 498 (ఎ) ప్రకారం ఆయనపై ఎఫ్.ఐ.అర్. నమోదు చేసారు. తన భర్త శ్రీను వైట్ల గత కొన్ని నెలలుగా తనను శారీరకంగా, మానసికంగా చాలా హింసిస్తున్నాడంటూ సంతోషి రూప తన పిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆమె పోలీసులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. వారు శ్రీను వైట్ల వాగ్మూలం నమోదు చేసుకొనేందుకు వారి ఇంటికి వెళ్లినప్పుడు, ఆమె తామిద్దరం రాజీ పడ్డామని కనుక తన పిర్యాదును వాపసు తీసుకోవాలనుకొంటున్నట్లు తెలిపారు. అయితే శ్రీను వైట్లపై ఎఫ్.ఐ.అర్. నమోదు చేసి ఉన్నందున పిర్యాదును వాపసు తీసుకోవడానికి వీలుపడదని పోలీసులు ఆమెకు తెలిపారు. కోర్టులో హాజరయ్యి కోర్టు అనుమతితో పిర్యాదు వాపసు తీసుకోవలసిందిగా సూచించారు.