తెలుగు సినిమా చరిత్రలో కనివిని ఎరుగని ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఏ హీరో అయినా సరే ఇప్పుడు స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారంటే తమని తాము కొత్తగా ప్రెజెంట్ చేసుకోవాలని ప్రయోగాలు చేసి ప్రయాస పడ్డవాళ్లే. ఏ హీరో అయినా ప్రయోగాత్మక సినిమా చేస్తున్నాడు అంటే అది కచ్చితంగా ప్రేక్షకాదరణ నోచుకోలేదు అని.. అయితే దశాబ్ధ కాలం నాటి మాట.. పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. రెగ్యులర్ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టిన ఆడియెన్స్ ప్రయోగాలు చేయండి హీరోలు అంటూ వారే హింట్ ఇస్తున్నారు.
తమ హీరో అది చేశాడు.. ఇది చేశాడు అని రెచ్చిపోయే అభిమానులు ఇప్పుడు తమ హీరో ఇలాంటి డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నాడంటూ వారిని ప్రోత్సహించడం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే మల్టీస్టారర్ సినిమాల జోరు కూడా ఊపందుకుంది. ఇలానే ప్రయోగాలు చేస్తూ హీరోల ఇమేజ్ లతో సినిమా ఆడటం కాదు కథలతో సినిమా ఆడే రోజులు మళ్లీ వస్తున్నాయని తెలుస్తుంది తెలుగు సిని పరిశ్రమ.. అది అందుకుంటున్న విజయాలను చూస్తుంటే.
కథలో హీరో స్టార్ అవ్వాలి కాని హీరో ఉన్నాడు కాబట్టి అతన్ని స్టార్ చేయకూడదు అన్న మాట ఇప్పుడు మన దర్శక నిర్మాతలు అర్ధం చేసుకుని మంచి సినిమాలను చేస్తూ అంతే మంచి విజయాలను దక్కించుకుంటున్నారు. అందుకే ఇప్పుడు స్టార్ హీరోలు కూడా ప్రయోగం అంటే పారిపోకుండా మేము చేస్తాం అంటే మేము చేస్తామని ముందుకొస్తున్నారు. మారుతున్న కాలాన్ని బట్టి ప్రేక్షకులు వారి ఆలోచనలు మారాయి సో ఆడియెన్స్ ఇస్తున్న రెస్పాన్స్ బట్టి కూడా సినిమా వాటి క్వాలిటీస్ కూడా మారడం తెలుగు సినిమాలో ఈ మధ్య జరిగిన గొప్ప మార్పు అని చెప్పొకోవచ్చు.