హైదరాబాద్: శ్రీలంక స్టార్ బ్యాట్స్‌మ్యాన్ కుమార్ సంగక్కర రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఆగస్టులో స్వదేశంలో భారత్‌తో జరిగే సిరీస్‌లో ఆడే రెండో టెస్టే అంతర్జాతీయ క్రికెట్లో తన ఆఖరి టెస్ట్ అని చెప్పాడు. సంగక్కర ప్రస్తుతం కొలంబోలో పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆడుతున్నాడు. ఇవాళ ఆ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసిన తర్వాత సంగక్కర తన నిర్ణయాన్ని ప్రకటించాడు. తాను ఈ ఏడాది మొదట్లో వరల్డ్ కప్ ముగియగానే రిటైర్ అవుదానుకున్నప్పటికీ, సెలక్టర్ల అభ్యర్థనమేరకు ఇప్పటివరకు కొనసాగానని చెప్పాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక స్కోర్ చేసినవారి జాబితాలో సంగక్కర ఐదవవాడు.