హీరోల మధ్య స్నేహం చిరురిస్తోంది. ఓ హీరో సినిమాకి సాయం చేయడానికి మరో హీరో.. ముందుకొస్తున్నాడు. పవన్ కల్యాణ్ సినిమా జల్సా కోసం వాయిస్ ఓవర్ ఇచ్చాడు మహేష్ బాబు. బాద్ షా కోసం కూడా మహేష్ మాట సాయం చేశాడు. ఈ సంప్రదాయం జనతా గ్యారేజ్ కోసం కూడా కొనసాగిస్తున్నాడన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం జనతా గ్యారేజీ. ఈ సినిమా కోసం మహేష్ వాయిస్ ఓవర్ చెప్పబోతున్నాడట.
తనకి శ్రీమంతుడులాంటి హిట్ ఇచ్చిన కొరటాల శివ అంటే ఎంతో గౌరవం మహేష్ కి. అంతే కాదు.. ఎన్టీఆర్‌తో కూడా మహేష్‌కి మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. నాన్నకు ప్రేమతో విడుదలైన తరవాత ఎన్టీఆర్‌కి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పాడు మహేష్. ఆ స్నేహబంధంతోనే ఇప్పుడు జనతా గ్యారేజీకి వాయిస్ ఓవర్ చెప్పడానికి ముందుకొచ్చాడట. ఈ టీమ్‌తో మహేష్ చేతులు కలపడం.. జనతా గ్యారేజీకి స్పెషల్ ఎట్రాక్షన్ కాబోతోంది. సో… జనతా గ్యారేజీ మహేష్ ఫ్యాన్స్‌నీ బుట్టలో వేసుకోవడానికి పెద్ద స్కెచ్చే వేసిందన్నమాట.