హైదరాబాద్: తెలుగుదేశంపార్టీ ఓటుకు నోటు కేసులో కొత్తకోణాన్ని బయటకు తీసుకొచ్చింది. ఫిర్యాదిదారు, క్రైస్తవ నామినేటెడ్ ఎమ్మెల్యే స్పీఫెన్సన్ జగన్మోహన్ రెడ్డి మనిషని ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. స్టీఫెన్సన్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని జగన్ గతంలో కేసీఆర్‌కు సిఫార్సులేఖ రాశారని యనమల చెప్పారు. జగన్, హరీష్, స్పీఫెన్సన్ ఒక రహస్యప్రదేశంలో సమావేశమై ఓటుకు నోటు వ్యవహారానికి పదిరోజులముందే పథకం పన్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలంగాణ హోం మంత్రే ఒప్పుకున్నారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌పై తమవద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని అన్నారు. ఈ కేసునుంచి కేసీఆర్ తప్పించుకోలేరని యనమల చెప్పారు.